ఎస్సీలకు బడ్జెట్​లో 18%  నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి

ఎస్సీలకు బడ్జెట్​లో 18%  నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి
  • సీఎంకు చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఎస్సీలకు18 శాతం నిధులు కేటాయించాలని సీఎం రేవంత్​రెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల డిక్లరేషన్​ ప్రకారం ఎస్సీలకు కేటాయించాల్సిన నిధులపై శనివారం సీఎంకు లేఖ రాశారు. ‘‘రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లతో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తుండడం హర్షణీయం. చేవెళ్ల డిక్లరేషన్​ ప్రకారం బడ్జెట్​లో ఎస్సీలకు 18 శాతం నిధులు రూ.54 వేల కోట్లు కేటాయించాలి.

దళితుల అభివృద్ధికి ఈ ఫండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా చేస్తే దళితులు ఎప్పటికీ కాంగ్రెస్​పార్టీ వెంటే ఉంటారు’ అని వివేక్​ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. అలాగే గతేడాది బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో రూ.8 వేల కోట్లు ఖర్చు చేయకుండా మిగిలిపోయాయని లేఖలో గుర్తు చేశారు.